పెందుర్తి రైల్వే స్టేషన్ లో 3 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం, దక్షిణ విశాఖ పరిధిలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, పెందుర్తి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో, గంజాయి ముద్దాయి కోసం వేచి ఉండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూడగానే పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో, అతను విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్