విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 724 కి. మీ. దూరంలో 'దానా' తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం వెల్లడించారు. ఇది క్రమేపి ఒడిశా వైపు కదులుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.