విశాఖపట్నం, దక్షిణ విశాఖలో పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, ఆర్.ఐ. (సెక్యూరిటీ వింగ్) ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ బృందాలు బుధవారం తనిఖీలు నిర్వహించాయి. మర్రిపాలెం రైల్వే స్టేషన్ పరిసరాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో 8 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.