విశాఖలో మబ్బుల వాతావరణం నెలకుంది. వర్షం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి కాస్త వరుణుడు తెరిపిచ్చినప్పటికీ, సాయంత్రం నుంచి మళ్లీ వాతావరణం మారిపోయింది. దక్షిణ ఏపీ వైపుగా అల్పపీడనం ప్రభావం కొనసాగుతోందని విశాఖలోని వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే విశాఖతోపాటు ఉత్తరాంధ్రలో కూడా వర్షం పడే అవకాశం ఉంది.