యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ దేవర విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల ఉత్సాహానికి అవధుల్లేవు. అభిమానులు ప్రమోషన్స్‌ను భారీగా చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ మేరకు సెప్టెంబర్ 22 వతేదీన విశాఖలోనీ సీఎంఆర్ సెంట్రల్‌లో ఫ్లాష్‌మాబ్ ఏర్పాటు చేసినట్టు ఎన్‌టీఆర్ అభిమాన సంఘం శనివారం ట్విట్టర్ వేదికగా పోస్టర్ విడుదల చేసింది. అభిమానులంతా హాజరుకావాలని కోరింది.