పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండాడ సమీపంలో మంగళవారం ఓ వ్యక్తి గాజు సీసాతో మెడ కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణ స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సదరు వ్యక్తి తల్లిదండ్రులు ఐదేళ్ల కిందట మృతి చెందారు. మూడేళ్ల కిందట భార్య వదిలిపెట్టి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.