రైల్వే బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి

గాజువాక మండలం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు రైల్వే బ్రిడ్జిపై వెళ్తున్న బుల్లెట్ బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్