ప్రహ్లాదపురంలో కిరాణా షాపులో అగ్నిప్రమాదం

ప్రహ్లాదపురం వద్ద గురువారం ఉదయం ఒక కిరాణా షాపులో ఆకస్మికంగా మంటలు చెలరేగి భారీ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల షాపుల వారు యజమానికి సమాచారం అందించడంతో స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనలో షాపులోని సరుకులు కొంతమేర కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్

✕
✕