విశాఖలోని రెడ్డికంచరపాలెంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భార్యను హత్య చేసిన భర్త, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, నందిగామ గోపీనాథ్ (42), పెయింటింగ్ పనులు చేసుకునేవాడు. నిన్న రాత్రి భార్య వెంకటలక్ష్మి (39) తనపై పెట్టిన పోలీస్ కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గురువారం రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో గోపీనాథ్ ఇంట్లో ఉన్న డంబుల్‌తో వెంకటలక్ష్మి తలపై కొట్టి హత్య చేశాడు.