విశాఖ రైల్వే స్టేషన్‌లో కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమ రవాణా శనివారం గుట్టురట్టయింది. రైల్వే పోలీసులు 11 బాలికలను రెస్క్యూ చేసి, నిందితుడు రవికుమార్ బిసోయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నేపాల్ ప్రాంతాల నుంచి 100కి పైగా బాలికలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.