కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం: గ్రామీణ ఉపాధికి భరోసా

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడం, పేద కుటుంబాలకు స్థిరమైన ఆదాయ భద్రత కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “వికసిత్ భారత్ – రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) గ్యారంటీ (వీబీ-జీరామ్ -జీ )” పథకం దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి అమలులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 2న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో అధికారికంగా ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్