సముద్ర మత్స్య సంపదను రక్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెకనైజ్డ్, మోటారు బోట్ల ద్వారా చేపల వేటపై నిషేధం విధిస్తూ మత్స్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజులపాటు సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం అమల్లో ఉంటుందని విశాఖ మత్స్యశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఈ మేరకు మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిషేధ కాలంలో మత్స్యకారులు సముద్రంలో వేట చేయకూడదని స్పష్టం చేసింది.