విశాఖ కేజీహెచ్‌లో సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తున్నామని సూపరిటిండెంట్ డాక్టర్ శివానంద ఆదివారం తెలిపారు. ఆదివారం కేజీహెచ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ మెహర్ కుమార్, డాక్టర్ వాసవీ లత తో కలిసి డాక్టర్ శివానంద మాట్లాడుతూ, రోగుల సౌకర్యార్ధం ఇప్పటివరకూ వారానికి రెండురోజులు నిర్వహించే వివిధ సూపర్ స్పెషాలిటీ అవుట్ పేషంట్ విభాగాలను వారంలో అన్నిరోజులు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.