విశాఖ: అన్నాక్యాంటీన్ల నిర్వహణపై పర్యవేక్షణ ఉండాలి

విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌ సోమవారం జోన్‌-4 పరిధిలోని కేజీహెచ్ సమీపాన ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణను నిత్యం పర్యవేక్షించాలని జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడును ఆయన ఆదేశించారు. క్యాంటీన్‌కు వచ్చే వారు ఎండ, వానల నుంచి రక్షణ పొందేలా షెడ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆహారం నాణ్యత, రుచి, పరిశుభ్రతపై అక్కడి భోజనం చేసే వారిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్