విశాఖ: అప్పన సన్నిధిలో దొంగలు హల్ చల్

సింహాచలం గిరి ప్రదక్షిణలో జేబుదొంగలు హల్చల్ చేస్తున్నారు. విశాఖ రూరల్ ప్రాంతానికి చెందిన మహిళల మెడల నుంచి 2 తులాల చైన్, 3 తులాల బంగారం తాడు దొంగిలించారు. ఆభరణాలు పోయిన మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు భక్తులు సెల్ ఫోన్లు, నగదు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావున గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు

సంబంధిత పోస్ట్