విశాఖ: తిరంగా యాత్రకు కేంద్ర మంత్రి రాక

విశాఖ ఈనెల 18వ తేదీ సాయంత్రం 4: 30 గంటలకు కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరగనుంది. పార్క్ హోటల్ నుంచి కాళీమాత ఆలయం వరకు సాగే ఈ యాత్రకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు శనివారం తెలిపారు. కూటమిలోని మూడు పార్టీలు ఈ యాత్రలో పాల్గొంటాయన్నారు.

సంబంధిత పోస్ట్