విశాఖ పూర్ణ మార్కెట్ రోడ్డులోని సత్యనారాయణ స్వామి టెంపుల్ సమీపంలోని ఘాట్ రోడ్డులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దేవర కృష్ణకుమారి అనే మహిళ మృతి చెందగా, ఆమె భర్త చిలుకు నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి స్కూటీ అదుపు తప్పి గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వారి ఆరు నెలల కుమార్తె హాట్వికా సురక్షితంగా బయటపడింది.