గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లపువానిపాలెంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ ఈశ్వర రావు (16) మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.