విశాఖ: నకిలీ పోలీసుల అరెస్టు

ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నకిలీ పోలీసులను పెందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రేమ జంటలను బెదిరించి గూగుల్ పే / ఫోన్ పే ద్వారా తమ ఖాతాల్లో నగదు జమ చేసుకునేవారని సతీష్ కుమార్ తెలిపారు. ఒక ప్రేమ జంట నుండి రూ. 5, 000 ఫోన్ పే చేయించుకున్న ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్