విశాఖ: మాజీ ఎమ్మెల్యే చింతలపూడి అరెస్ట్

గాజువాక మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు చింతలపూడి వెంకట రామయ్యను ఆనంద‌పురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆనందపురం మండలం రామవరం గ్రామంలో శుక్రవారం కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందాల్లో పాల్గొన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యతో బాటు మొత్తం 28 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో 2 లక్షల నగదు, 8 కోడి పుంజు, 20 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్