రెండో శనివారం సెలవైనప్పటికీ రేపు సెలవు ఉండదని విశాఖ జిల్లా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాలయం ప్రకటించింది. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగుతాయని శుక్రవారం తెలిపింది. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి సేవలు పొందాలని సూచించింది. ఈ సెలవు రద్దు కేవలం ఈ వారానికి మాత్రమే పరిమితమని కూడా కార్యాలయం స్పష్టం చేసింది.