విశాఖ: అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ శనివారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సింగం రాధ, డిప్యూటీ ఇంజినీర్‌ హరి, ఆలయ పర్యవేక్షణాధికారి త్రిమూర్తులు, నాదస్వర, వేద మంత్రాలతో వారికి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్