విశాఖలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్టు ఈఈ పోలాకి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. సూర్య నగర్, సంతోష్ నగర్, బాజీ జంక్షన్, రెడ్డి వీధి, సుసర్ల కాలనీ, జయప్రకాశ్ నగర్, ఎస్సీ కాలనీ, చంద్ర నగర్, గణేష్ నగర్, కారవిల్ నగర్, తుంపాలా వీధి తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.