విశాఖ: రెండురోజుల పాటు వర్షాలు

వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా నైరుతి రుతుపవనాలు శుక్రవారం అండమాన్ తీరాన్ని తాకాయి. ఇవి ఈ నెలాఖరులోగా కేరళ తీరాన్ని చేరుకునే అవకాశం ఉందని విశాఖవాతావరణకేంద్రం తెలిపింది. సాధారణంగా కంటే నాలుగు రోజుల ముందుగానే రుతుపవనాలు రావడం విశేషం శుక్రవారం రాయలసీమ, కోస్తాంధ్రలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. శని, ఆదివారాల్లో అల్లూరి, మన్యం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్