ఇంటర్ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ నాలుగో స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫస్టియర్ లో 40, 098 మంది పరీక్షలు రాయిగా 31866 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. ఈ మేరకు విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు.