విశాఖ: రోడ్డు ప్రమాదంలో యువ ఇంజనీర్ మృతి

విశాఖలో కాలేజీ బస్సు ఢీకొని ఓ యువ ఇంజనీర్ మృతి చెందాడు. కొత్తపాలెం ఆదర్శనగర్ కు చెందిన ఉమ్మి ఆదినారాయణ ఓ కార్పెంటర్. ఆయనకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు వెంకట బాలాజీ (26) ఇంజనీరింగ్ పూర్తిచేసి షిప్ యార్డ్ లో అప్రెంటీస్ గా పనిచేస్తున్నాడు. గురువారం విధుల‌కు వెళుతుండ‌గా గోపాల‌ప‌ట్నంలో రఘు ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ఢీకొట్ట‌డంతో బాలాజీ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్