జంపు పాలెంలో విద్యార్థుల దసరా సందడి

ఎలమంచిలి మండలం జంపపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు శనివారం గ్రామంలో దసరా సందడి చేశారు. పాత సంప్రదాయాన్ని గుర్తుకు తెస్తూ దసరా పాటలు పాడుతూ పూలబాణాలతో ఇంటింటికీ తిరిగారు. పూర్వం గ్రామాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ దసరా వారం రోజులు గ్రామాల్లో సందడి చేసేవారని గ్రామ పెద్దలు తెలిపారు. మళ్లీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్