యలమంచిలి: పంటలకు ఈ క్రాప్ నమోదు చేయించాలి

రబీలో సాగుచేస్తున్న పంటలకు రైతులు ఈక్రాప్ నమోదు చేయించాలని వ్యవసాయ శాఖ యలమంచిలి సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ సుమంత సూచించారు. యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో గురువారం రబీలో సాగు చేస్తున్న అపరాల పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25వ తేదీ లోపు ఈ క్రాప్తో పాటు ఈకేవైసీ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్