విశాఖ: రైడర్ పై ర్యాపిడో డ్రైవర్ దాడి

విశాఖలో ర్యాపిడో బైక్ డ్రైవర్ తన బుద్ది చూపించాడు. ఏప్రిల్ 10న రైడర్ పై దాడికి పాల్పడ్డాడు. శ్రీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర మణికంఠ అనే వ్యక్తి బైక్ బుక్ చేసుకున్నాడు. బైక్ కణితి స్మశాన వాటిక దగ్గరికి వెళ్లగానే బైక్ ఆపి, ఆ రైడర్ పై డ్రైవర్ దాడి చేశాడు. బెదిరించి ఫోన్ పే ద్వారా రూ.48వేలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఫోన్ నంబర్ ఆధారంగా నిందితున్ని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్