నిత్యం ప్రజల్లో ఉండాలి.. ప్రజల కోసం పని చేయాలి: చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నేతలు నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. అన్నదాత సుఖీభవ, పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించారు. అలాగే సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు. చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నామని, ఆగస్టులోనే సూపర్ సిక్స్ లోని రెండు హామీలు నెరవేరుస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్