విజయవాడలోని పున్నమి ఘాట్‌లో రెండో రోజు ఆవకాయ అమరావతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనంగా జరిగిన ఈ ఉత్సవాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణానది తీరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్య ప్రదర్శనలు, సినీ సాహిత్యంపై జరిగిన చర్చలు మంచి స్పందన పొందాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు.