AP: విశాఖలో మంత్రి అనిత ఉండవల్లి ఘటనపై స్పందించారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అక్కడ తలెత్తిన ఉద్రిక్తతలకు వైసీపీ నేతలే కారణమని ఆరోపించారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా రైతుల వద్దకు వెళ్లడమే రైతులు తిరగబడటానికి కారణమని తెలిపారు. "3 రాజధానులని కొన్ని రోజులు, ఇప్పుడు మావిగన్ మా రాజధాని" అనే వైసీపీ నేతలకు రాజధానిపై సరైన స్పష్టత లేదని మంత్రి విమర్శించారు.