AP: రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి కౌలు సొమ్ము పంపిణీ చేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. సీఆర్‌డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షలో 16,667 ఎకరాల భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ భూమిని అంతర్జాతీయ క్రీడా నగరం, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల కోసం కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. భూ సమీకరణలో తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి సూచించారు.