అమరావతి సాధ్యం కాదు: తమ్మినేని సీతారాం

AP: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయడం సాధ్యం కాదని వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన, అమరావతికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారని, ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అమరావతిపై అమలు కాని హామీలు ఇస్తోందని విమర్శించారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్లాన్‌కు తక్కువ ఖర్చు అవుతుందని, రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అసలు అమరావతిని రాజధానిగా ఎంచుకోవడమే తప్పని సీతారాం వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్