AP: అమరావతే రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం కుప్పంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరెన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతిని ఇంచు కూడా కదిలించలేదు. దేవతల రాజధాని అమరావతి తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆర్థిక అసమానతలు తొలగించడం, సంపద సృష్టి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే పీ4 ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు.