AP: అమరావతిని హైదరాబాద్‌ను మించిన మహానగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. “అమరావతి అంటే హైదరాబాద్ ప్లస్” అని పేర్కొన్నారు. TDP 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం మాట్లాడుతూ, ఇకపై మూడు రాజధానుల విధానం ఉండదని, ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి వ్యతిరేక శక్తులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రయాణంలో కార్యకర్తల త్యాగాలు మరువలేనివని, భవిష్యత్తులోనూ పార్టీ విజయమే లక్ష్యమని పేర్కొన్నారు.