ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని బీజేపీ ఎంపీ పురందేశ్వరి అన్నారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్వహించిన చర్చలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ అరాచకంగా జరిగిందన్నారు. ఆనాడు చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారని వెల్లడించారు. పార్లమెంట్‌లో లైట్లు, కెమెరాలు ఆపి బిల్లు పాస్ చేశారని గుర్తు చేశారు.