రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతు తెలిపారు. అమరావతి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని, దీనిని రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధిపై ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉందని, సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్లే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు.