ఏపీ పోలీసుల తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసులకు కమ్మ కులపిచ్చి పట్టిందని ఆయన ఆరోపించారు. బ్యాలెట్ బాక్సును పగలగొట్టి రిగ్గింగ్‌కు పాల్పడిన టీడీపీ వారిపై కేసులు నమోదు చేయకుండా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. పోలీసుల వ్యవహార శైలిపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ, 2029లో కచ్చితంగా దీనికి ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు.