AP: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వస్తున్న ఆయన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును దుర్భాషలాడిన కేసులో అరెస్టు అయినప్పటికీ.. రాంబాబు రెండు వారాల్లోనే అన్ని కేసుల్లో బెయిల్ పొందారు. ఈ క్రమంలో వైసీపీ మద్దతుదారులు, అంబటి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.