రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి నిర్మాణం, పెట్రోల్ కొరత, వైసీపీ నేతలపై కేసుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుదోవ పడుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో సంక్షోభాలు ఏర్పడ్డాయని నంద్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. అమరావతి ప్రాజెక్ట్ పేరిట అవినీతి జరుగుతోందని, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.