అన్న క్యాంటీన్‌ వంటశాలలో పేలుడు (వీడియో)

AP: కడపలోని అన్న క్యాంటీన్‌ వంటశాలలో భారీ పేలుడు సంభవించింది. మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న అన్య క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వంట గదిలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భారీ పేలుడు సంభవించడంతో వంటశాల షెడ్ ధ్వంసమైంది. ఘటన సమయంలో ఎవరూ లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్