ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

AP: వైఎస్సార్ కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. 114 ఎర్రచందనం దుంగలు, 7 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సిద్ధవటం ప్రాంతంలో అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 60 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధవటం రేంజ్ పరిధిలో మరో 25, బద్వేల్‌లో 12, ప్రొద్దుటూరులో 11, వేంపల్లి రేంజ్ పరిధిలో 6 దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕