రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

నాయుడుపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పట్టాలు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి 25 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నీలి రంగు జీన్స్, ప్యాంట్ ధరించి ఉన్నాడు. సూళ్లూరుపేట ఇన్‌ఛార్జ్ రైల్వే ఎస్ఔ జి.మాల కొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్