ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. శుక్రవారం అనకాపల్లిలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొత్తూరులో సామాజిక భవనం, తుమ్మపాలలో రోడ్లు, కాలువల నిర్మాణం, అలాగే అనారోగ్య బాధితుల కోసం CMRF సహాయం కోరుతూ స్థానికులు అర్జీలు సమర్పించారు.