ఇంటర్ పరీక్షకు 383 మంది డుమ్మా

అనకాపల్లి జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 383 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 9,375 మంది విద్యార్థులకు గాను 8,992 మంది పరీక్షకు హాజరైనట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా, పటిష్టమైన ఏర్పాట్లతో జరుగుతున్నాయని, మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్