సాకారమైన చిరకాల స్వప్నం: అనకాపల్లి ఎంపీ

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్న ఈ కొత్త జోన్ ఏర్పాటుపై అనకాపల్లి ఎంపీ డాక్టర్ సి. ఎం. రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల కృషితో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిందని ఆయన కొనియాడారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్