అనకాపల్లి: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

శనివారం గవరపాలెం సంతబయలు వద్ద కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 45 ఏళ్ల వయసున్న మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, కాలువలో పడి మృతిచెంది ఉంటాడని ఎస్సై శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్