అన‌కాప‌ల్లి: చిట్టీల పేరుతో మోసం

పరవాడ ప్రాంతంలో చిట్టీల పేరుతో సామాన్యులను నమ్మించి భారీ మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు విజయనగరంలో అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 8 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేసి పరారైనట్లు ప్రాథమిక సమాచారం. మోసపోయామని గ్రహించిన బాధితులు పరవాడ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితుల ఫిర్యాదులను స్వీకరిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కష్టపడి దాచుకున్న సొమ్ము పోవడంతో బాధితులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్