అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు హుండీలను అపహరించారు. గత ఆరు సంవత్సరాలుగా హుండీ ఆదాయం, బంగారం, వెండి ఆభరణాల లెక్కింపు జరగకపోవడంతో హుండీల్లో సుమారు రూ. 50 లక్షల వరకు నగదు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.